Homeఫ్లాష్ ఫ్లాష్T20 World Cup 2024: పాకిస్థాన్‌ను ఓడించడానికి అరగంట సరిపోతుంది..ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యూఎస్ఏ కెప్టెన్..!

T20 World Cup 2024: పాకిస్థాన్‌ను ఓడించడానికి అరగంట సరిపోతుంది..ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యూఎస్ఏ కెప్టెన్..!

టీ20 ప్రపంచకప్-2024లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్-ఎలో నేడు డల్లాస్‌లో అమెరికా-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈరోజు రాత్రి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సూపర్-8కి అర్హత సాధించేందుకు అమెరికాకు ఈ మ్యాచ్ కీలకం. అయితే రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్‌ను ఓడించడం ఆతిథ్య జట్టు అమెరికాకు అంత సులువు కాదు. అయితే ఈరోజు పాకిస్థాన్‌ను ఓడించడం ఖాయమని అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌ను ఓడించడానికి అరగంట సరిపోతుందని అన్నాడు. మైదానంలో మెరుగ్గా రాణిస్తే ప్రత్యర్థిని ఓడించడం కష్టమేమీ కాదన్నాడు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో 30-40 నిమిషాల పాటు మేము మంచి ప్రదర్శన చేస్తే చాలు.. మ్యాచ్‌ని మలుపు తిప్పుతాం అని మోనాంక్ అన్నాడు.

Recent

- Advertisment -spot_img