Homeహైదరాబాద్latest NewsT20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన న్యూజిలాండ్

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన న్యూజిలాండ్

జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది. కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టును సోమవారం వెల్లడించారు. ఈ గొప్ప పోరుకు అందరికంటే ముందే న్యూజిలాండ్ జట్టును ప్రకటించారు. అయితే ఎంపికైన కివీస్ జట్టులో సంచలన నిర్ణయాలేమీ లేవు. ఊహించినట్లుగానే ఫామ్ లేమి కొంత మంది ఆటగాళ్ల పై వేటు వేసింది.. మరికొందరు గాయపడిన ఆటగాళ్లను పక్కన పెట్టారు. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్, ఆల్ రౌండర్ ఆడమ్ మిల్నే దూరమయ్యారు. ఫామ్‌లో లేని విల్ ఒరూర్క్, టామ్ లాథమ్ మరియు టిమ్ సీఫెర్ట్‌లను సెలక్టర్లు పక్కన పెట్టారు. మరోవైపు, కేన్ విలియమ్సన్‌తో పాటు వెటరన్‌లు టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌లను ప్రపంచకప్ జట్టులో చేర్చారు. ఆటగాడిగా విలియమ్సన్‌కి ఇది ఆరో టీ20 ప్రపంచకప్ కాగా, కెప్టెన్‌గా నాలుగోది.
టీ20 వరల్డ్ కప్‌కు న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథి.
ట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్.

Recent

- Advertisment -spot_img