Homeహైదరాబాద్latest NewsT20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే.. వికెట్ కీపర్ రేసులో ఆ...

T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే.. వికెట్ కీపర్ రేసులో ఆ ఇద్దరు..?

టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురుకానుంది. భారత జట్టులో చోటు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ కేరళ బ్యాట్స్ మెన్ మరోసారి బీసీసీఐ మొండి చెయ్యే చూపించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్ 62.80 సగటుతో, 152.43 స్ట్రైక్ రేట్‌తో 314 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో 2024 టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్‌కు భారత జట్టులో చోటు దక్కుతుందని అందరూ భావించారు. కనీసం రెండో వికెట్ కీపర్‌గా అయినా అతన్ని తీసుకుంటారని ఆశిస్తున్నారు.

కానీ రిషభ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత ప్రధాన వికెట్ కీపర్ స్లాట్ లాగేసుకున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదంతో దూరమైన పంత్.. ఈ సీజన్‌తోనే రీఎంట్రీ ఇచ్చి దుమ్మురేపుతున్నాడు. ఈ ప్రదర్శనతో రిషబ్ పంత్ ప్రపంచకప్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. అలాగే రెండో వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంజూ శాంసన్‌ కంటే రాహుల్‌ రికార్డులు మెరుగ్గా లేకపోయినా, లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌లో ఆడే అవకాశం ఉండడంతో పాటు అనుభవం ఎక్కువగా ఉండటం రాహుల్ కలిసొచ్చే అంశం. అయితే ఈ సారి కూడా సంజూ శాంసన్‌కు టీ20 ప్రపంచకప్‌ భారత జట్టులో చోటు దక్కుతుందని అనిపించలేదు.

Recent

- Advertisment -spot_img