Homeహైదరాబాద్latest NewsT20 World Cup: టీమిండియాకు బిగ్‌ షాక్‌.. రోహిత్‌ శర్మకు గాయం.. అభిమానుల్లో ఆందోళన..

T20 World Cup: టీమిండియాకు బిగ్‌ షాక్‌.. రోహిత్‌ శర్మకు గాయం.. అభిమానుల్లో ఆందోళన..

టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్థాన్‌తో హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియాకు పెద్ద షాక్ తగిలింది. ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిల్ వేసిన బంతి హిట్ మ్యాన్ మోచేయికి బలంగా తాకింది. ఈ దెబ్బకు రోహిత్ శర్మ నొప్పితో కుంగిపోయాడు. ఫిజియోల తొలి చికిత్స తర్వాత నొప్పితో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ తర్వాత రిటైర్డ్ హర్ట్ గా మైదానాన్ని వీడాడు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరో మూడు రోజుల్లో టీమిండియా కీలక మ్యాచ్‌ ఆడాల్సి ఉంది.
ఆదివారం న్యూయార్క్‌లోని ఇదే వేదికపై టీమిండియా పాకిస్థాన్‌తో హైవోల్టేజ్ మ్యాచ్ ఆడనుంది. ఈ భీకర మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ గాయపడడం అభిమానులను కలవరపెడుతోంది. ఈ మ్యాచ్ అనంతరం తన గాయంపై స్పందించిన రోహిత్ శర్మ.. ఇది కాస్త బాధాకరమని అన్నాడు. అతని గాయం తీవ్రతను బట్టి బీసీసీఐ వైద్య బృందం అతనికి చికిత్స చేయనుంది. గాయం పెద్దదైతే, స్కాన్ చేయబడుతుంది. రోహిత్ శర్మ మోచేతిలో పగుళ్లు వచ్చినా.. తీవ్రంగా గాయపడినా జట్టు నుంచి తప్పుకోవాల్సి వస్తుంది.

Recent

- Advertisment -spot_img