డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ లో సూపర్-8కి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన సమయంలో రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించారు. ఒమన్‌పై కేవలం 3.1 ఓవర్లలో విజయం సాధించడంతో వారి నెట్ రన్ రేట్ గణనీయంగా మెరుగుపడింది. -1.800 నుండి +3.081కి కదులుతూ, నెట్‌రన్‌రేట్‌లో స్కాట్‌లాండ్‌ను అధిగమించి రేసులో ముందంజ వేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 3.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్ బట్లర్ (24 నాటౌట్; 8 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బౌలర్లపై చెలరేగిపోయాడు. 101 బంతులు మిగిలుండగానే గెలిచిన ఇంగ్లండ్.. టీ20 వరల్డ్ కప్‌లో బంతుల పరంగా అత్యంత వేగంగా ఛేదన చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది.