Homeఫ్లాష్ ఫ్లాష్T20 World Cup: మురికివాడల నుంచి టీ20 ప్రపంచకప్‌కు.. అంతర్జాతీయ ఆటగాడే కానీ ఇప్పటికీ అక్కడే..?

T20 World Cup: మురికివాడల నుంచి టీ20 ప్రపంచకప్‌కు.. అంతర్జాతీయ ఆటగాడే కానీ ఇప్పటికీ అక్కడే..?

టీ20 ప్రపంచకప్‌లో ఉగాండా తరఫున ఆడుతున్న జుమా మియాగి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఉగాండా రాజధాని కంపాలా శివారులోని నాగురు మురికివాడకు చెందిన 21 ఏళ్ల మియాగి ఇప్పటివరకూ 21 అంతర్జాతీయ టీ20ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికీ కుటుంబంతో కలిసి అతను మురికివాడల్లోనే ఉంటున్నాడు. ప్రపంచకప్‌లో ఉగాండా తమ తొలి మ్యాచ్‌ను సోమవారం అఫ్గానిస్థాన్‌తో ఆడుతుంది. ఫుట్‌బాల్‌ను ఇష్టపడే దేశంలో క్రికెట్ ఇప్పుడు ప్రజాదరణ పొందుతోంది. ఇలాంటి ఆటగాళ్లను ఆదర్శంగా తీసుకుని మురికివాడల నుంచి మరికొంత మంది జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని ఆ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన భారత ఆటగాడు అభయ్ శర్మ అన్నాడు. “కొందరు ఆటగాళ్లు చాలా పేద నేపథ్యం నుండి వచ్చారు. వారు జాతీయ జట్టుకు ఆడటం చాలా స్ఫూర్తిదాయకం అని ఆయన అన్నారు.

Recent

- Advertisment -spot_img