టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జోరు కొనసాగుతోంది. గ్రూప్-డిలో ఆడిన ముగ్గురిలో నేగి సూపర్-8 అర్హతకు చేరువయ్యాడు. బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌లో అత్యల్ప స్కోరు(114)ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. 20ల్లో స్వల్ప స్కోరును డిఫెండ్ చేయడంలో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యుత్తమం. అంతకుముందు శ్రీలంకపై కాపాడుకున్న 116 పరుగుల లక్ష్యం ఉత్తమంగా ఉండేది. నిన్న బంగ్లాదేశ్‌పై గెలుపుతో ఈ ఘనత సాధ్యమైంది. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక-120 (vsన్యూజిలాండ్), ఇండియా-120 (vsపాకిస్థాన్), అఫ్గాన్-124 (vsవెస్టిండీస్), న్యూజిలాండ్-127 (vsఇండియా) ఉన్నాయి. అలాగే టీ20 ఫార్మాట్‌లో బంగ్లాపై వరుసగా అత్యధిక మ్యాచ్‌లు(9) గెలిచిన రెండో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. న్యూజిలాండ్ 10 గెలుపులతో తొలిస్థానంలో ఉంది.