Homeహైదరాబాద్latest NewsT20 World Cup: అఫ్గానిస్థాన్‌పై వెస్టిండీస్ సంచలన విజయం.. అరుదైన రికార్డు.. ఒకే ఓవర్‌లో 36...

T20 World Cup: అఫ్గానిస్థాన్‌పై వెస్టిండీస్ సంచలన విజయం.. అరుదైన రికార్డు.. ఒకే ఓవర్‌లో 36 పరుగులు..

వెస్టిండీస్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. అఫ్ఘానిస్థాన్‌ను ఓడించి అజేయంగా సూపర్-8కి చేరుకుంది. మంగళవారం సెయింట్ లూసియాలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 104 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒకే ఓవర్‌లో 36 పరుగులు రాబట్టి రికార్డు సృష్టించింది. విండీస్ బ్యాటర్లు చార్లెస్, పూరన్ ఇద్దరూ కలిసి ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ అజ్మతుల్లా వేసిన నాలుగో ఓవర్‌లో పరుగుల వరద పారించారు. దీంతో టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన జట్లలో ఒకటిగా వెస్టిండీస్ నిలిచింది. కాగా, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిచింది.

Recent

- Advertisment -spot_img