Homeహైదరాబాద్latest Newsఈజీమనీ కోసం టాలెంట్ చూపించారు..వహ్! climax చూస్తే..

ఈజీమనీ కోసం టాలెంట్ చూపించారు..వహ్! climax చూస్తే..

Idenijam, Hyderabad : ఇప్పటివరకూ కార్లు, బైకుల దొంగతనాల గురించి విన్నాం. వాహనాల విడిభాగాలు అమ్మే దొంగల గురించి తెలుసు. వాహనాలను ధ్వంసం చేసే దుశ్కార్యాల గురించీ అప్పుడప్పుడు వార్తల్లో వింటుంటాం. కానీ హైదరాబాద్‌లోని ఓ ముఠా చేసిన పని చూస్తే షాక్ అవ్వక తప్పదు. ఎంతలా అంటే విషయం తెలుసుకొని పోలీసులే విస్తుపోయారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ ఓ నలుగురు వ్యక్తులు కొత్తతరహా మోసానికి తెరతీసారు. గుట్టుచప్పుడు కాకుండా కొంతకాలంగా మోసానికి పాల్పడుతున్నారు. కానీ ఎన్నిరోజులు వాళ్ల ఆటలు సాగుతాయి? నిజం ఎప్పటికైనా వెలుగు చూడాల్సిందే అన్నట్లు వాళ్ల కీచక చర్యలు బహిర్గతం అయ్యాయి. అద్దెకు తీసుకున్న కార్లను అమ్మి పబ్బం గడుపుతున్న ముఠాను మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి కోటి రూపాయలు విలువ చేసే ఆరు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లాంగ్‌‌డ్రైవ్ టూర్‌కి వెళ్లాలంటూ నిందితులు మొదటగా ట్రావెల్స్ యజమానుల దగ్గర కార్లు అద్దెకు తీసుకుంటారు. ఆ తర్వాత కార్లను తాకట్టు పెట్టి లక్షల రూపాయలు అప్పు తీసుకుంటారు. కొన్ని కార్లను సెకండ్ హ్యాండ్‌లో అమ్మేస్తుంటారు. వచ్చిన డబ్బులతో జల్సాలకు పాల్పడుతూ చిల్ అవుతుంటారు. ఇలా ఇప్పటివరకూ పదుల సంఖ్యలో వాహనాలను అమ్మేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆశ్చర్యమేమిటంటే ఇంతజరుగుతున్నా ట్రావెల్స్ యజమానులు ఇప్పటిదాకా ఏం చేశారనేది సస్పెన్స్. ట్రావెల్స్‌లో పనిచేస్తున్న సిబ్బంది అండదండలతోనే ఇదంతా జరిగిందా? మార్ట్‌గేజ్ విషయంలో వీళ్లకు సహకరించిందెవరు? కార్లతో పాటు వేరే వాహనాలను కూడా అమ్మేసారా? వచ్చిన డబ్బుతో ఏం చేశారు? అనే కోణంలో లోతైన విచారణ చేయాల్సి ఉంది. ఏదేమైనా ఈజీమనీ కోసం వీళ్లు ఎంచుకున్న పద్దతి చూసి కొందరు వాట్ ఏ టాలెంట్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img