HomeజాతీయంPetrol Export : పెట్రోలుపై ఎగుమతి సుంకం ఎత్తివేత

Petrol Export : పెట్రోలుపై ఎగుమతి సుంకం ఎత్తివేత

Petrol Export : పెట్రోలుపై ఎగుమతి సుంకం ఎత్తివేత

Petrol Export : పెట్రోలుపై ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం తొలగించింది.

డీజిల్‌, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ఎగుమతిపై, దేశీయంగా ఉత్పత్తిని చేసిన ముడిచమురుపై సుంకాన్ని తగ్గించింది.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 1న పెట్రోలు, ఏటీఎఫ్‌ ఎగుమతిపై లీటరుకు రూ.6, డీజిల్‌కు రూ.11 చొప్పున ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం విధించింది.

పెట్రోలుపై ఎగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించగా… డీజిల్‌, ఏటీఎఫ్‌పై ఎగుమతిపై లీటరుకు రూ.2 చొప్పున తగ్గించి వరుసగా రూ.11, రూ.4కు పరిమితం చేసింంది.

దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురుపై టన్నుకు రూ.23,250 మేర విధించిన విండ్‌ఫాల్‌పన్నును తాజాగా రూ.17,000కు తగ్గించింది.

ప్రత్యేకంగా ఎగుమతుల కోసం నెలకొల్పిన రిఫైనరీల్లో తయారయ్యే ఉత్పత్తులకు కూడా జులై 1 నుంచి అమల్లోకి తెచ్చిన ఎగుమతి సుంకం నుంచి మినహాయింపు ఇచ్చారు.

అంతర్జాతీయంగా తగ్గడం వల్లే

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జూన్‌లో బ్యారెల్‌ పెట్రోలు ధర 34.6 డాలర్లు ఉండగా.. జులైలో 10 డాలర్లకు దిగివచ్చింది.

పెట్రోలుపై జులై 1 నుంచి విధించిన లీటరుకు రూ.6 ఎగుమతి సుంకం.. బ్యారెల్‌కు 12 డాలర్లతో సమానం.

అంటే బ్యారెల్‌ పెట్రోలు ఎగుమతిపై 2 డాలర్ల నష్టమే మిగులుతుంది.

లీటరు ఏటీఎఫ్‌పై రూ.6 ఎగుమతి సుంకం అంటే బ్యారెల్‌కు 12 డాలర్లు, డీజిల్‌పై రూ.13 అంటే బ్యారెల్‌కు 26 డాలర్లు అవుతుంది.

దేశీయ ముడి చమురుపై టన్నుకు రూ.23,250 పన్ను లెక్కిస్తే బ్యారెల్‌కు 40 డాలర్లతో సమానం.

జూన్‌ నుంచి జులైకు డీజిల్‌ బ్యారెల్‌ ధర 48.9 డాలర్ల నుంచి 34.9 డాలర్లకు, ఏటీఎఫ్‌ ధర 41.6 డాలర్ల నుంచి 28 డాలర్లకు పడిపోయింది.

ముడిచమురు ధర కూడా బ్యారెల్‌ 100 డాలర్ల సమీపానికి వచ్చింది.

అందుకే ప్రభుత్వం సుంకాలను సవరించింది.

తాజా మార్పుల అనంతరం ముడి చమురు ఉత్పత్తిదారులకు బ్యారెల్‌కు 29 డాలర్లు, డీజిల్‌ ఎగుమతిపై బ్యారెల్‌కు 22 డాలర్లు, ఏటీఎఫ్‌కు బ్యారెల్‌కు 8 డాలర్లకు సమానమవుతుంది.

ఆ లెక్క తప్పినట్లే

విండ్‌ఫాల్‌ పన్ను అమల్లోకి వచ్చినప్పుడు.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.1 లక్ష కోట్లకు పైగా ప్రభుత్వానికి అదనపు ఆదాయం రావొచ్చని అంచనా వేశారు.

గత ఆర్థిక సంవత్సర స్థాయిలోనే ఉత్పత్తి ఉండే, దేశీయంగా వెలికితీసే ముడిచమురుపై రూ.65,600 కోట్ల అదనపు ఆదాయం రావొచ్చని భావించారు.

పెట్రోలు, డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతులపై సుంకం పూర్తి సంవత్సరానికి కొనసాగితే మరో రూ.52,700 కోట్లు వస్తాయని లెక్కగట్టారు.

తాజా మార్పులతో ఈ లెక్క తప్పినట్లే.

Recent

- Advertisment -spot_img