HomeరాజకీయాలుTDP MLA నిమ్మల రామానాయుడు అరెస్ట్

TDP MLA నిమ్మల రామానాయుడు అరెస్ట్

– పాలకొల్లులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇదే నిజం, ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ‘పాలకొల్లు చూడు’ పేరుతో నిరసన కార్యక్రమంలో భాగంగా పెంకిళ్లపాడు టిడ్కో గృహాల వద్ద వంటా వార్పు కార్యక్రమానికి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దీనికి పోటీగా వైసీపీ పాలకొల్లు సెగ్మెంట్​ ఇన్​చార్జిగా గొడాల గోపి ఆధ్వర్యంలో అదే ప్రాంతంలో ‘నిజం చెబుతాం’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనుమతి లేదంటూ రెండు పార్టీల కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ నిరసన వ్యక్తం చేసేందుకు టీడీపీ శ్రేణులు, లబ్ధిదారులు ఎమ్మెల్యే నిమ్మల ఇంటి వద్దకు చేరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యేను పోలీసుల గృహనిర్బంధం చేశారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. అయితే, పోలీసుల కళ్లుగప్పి ఎమ్మెల్యే రామానాయుడు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం జాతీయ జెండాలతో పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు ఆయనతో పాటు టీడీపీ, జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటిస్తుంటే అడ్డంకులేంటని మండిపడ్డారు. ఈ క్రమంలో జరిగిన పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే కిందపడిపోయారు. అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి భీమవరం వైపునకు తీసుకెళ్లారు.

Recent

- Advertisment -spot_img