– భయంతో బయటికి పరుగులు తీసిన ఎంపీలు
– ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: లోక్‌సభలో టియర్ గ్యాస్ కలకలం రేపింది. బుధవారం పార్లమెంట్ సెషన్స్ నడుస్తుండగా.. లోక్‌సభలో గుర్తు తెలియని వ్యక్తులు టియర్ గ్యాస్ వదిలారు. దీంతో ఎంపీలు భయంతో బయటికి పరుగులు తీశారు. లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకి టియర్ గ్యాస్ వదిలినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మరోవైపు స్పీకర్ లోక్‌సభను వాయిదా వేశారు.