Homeహైదరాబాద్latest Newsస్వచ్ఛ అవార్డులో మన తెలంగాణ హవా..

స్వచ్ఛ అవార్డులో మన తెలంగాణ హవా..

స్వచ్ఛ అవార్డుల్లో తెలంగాణ హవా కొనసాగుతోంది. స్వచ్ఛ భారత్ పట్టణ విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి 4 అవార్డులు వరించాయి. జాతీయస్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు దక్కించుకోగా.. సౌత్ ఇండియా విభాగంలో సిద్దిపేట, గుండ్లపోచంపల్లి, నిజాంపేట పట్టణాలు అవార్డులు దక్కించుకున్నాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ఈ 11న కేంద్రం ఈ అవార్డులను అందించనున్నది.

స్వచ్ఛ అవార్డులపై మాజీ మంత్రి హరీష్‌ రావు స్పందించారు. జాతీయ స్థాయిలో మరోసారి మన సిద్దిపేట సత్తా చాటిందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దక్షిణ భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. చెత్త సేకరణ, పారిశుద్ధ నిర్వహణల్లో సిద్దిపేట చేపట్టిన వినూత్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సిద్దిపేటకు జాతీయ స్థాయి అవార్డు రావడం ఎంతో గర్వకారణం. ఈ దిశగా ఎంతో గొప్ప సహకారం అందించిన పట్టణ ప్రజలకు , కృషి చేసిన కౌన్సిలర్లకు, మునిసిపల్ అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.. అని హరీష్ రావు పోస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img