– ఈ నెల 9 వరకు గడువు
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టీఎస్ సెట్-2023 పరీక్షా ప్రశ్నపత్రం ప్రాథమిక కీ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ కీపై అభ్యంతరాల స్వీకరణ మొదలైంది. నవంబర్ 7న మధ్యాహ్నం 1గంట నుంచి ఆన్‌లైన్‌లో అభ్యంతరాల స్వీకరణకు సంబంధించిన లింక్ అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://telanganaset.org/ ఈ లింక్‌పై క్లిక్ చేసి.. తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ కావాల్సి ఉంటుంది. అయితే, తగిన సాక్ష్యాలు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలు తెలిపేందుకు వీలుగా ఈ లింక్ ఈ నెల 9 మధ్యాహ్నం 1గంట వరకు అందుబాటులో ఉండనుంది.