Homeతెలంగాణ#KCR : తెలంగాణ క్యాబినెట్​ సమావేశం

#KCR : తెలంగాణ క్యాబినెట్​ సమావేశం

Telangana cabinet headed by Chief Minister KCR will meet on Friday. The meeting will be held at Pragati Bhavan on Friday morning. Information that the Cabinet will mainly discuss the forthcoming Greater Hyderabad Municipal Corporation (GHMC) elections.

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి శుక్రవారం సమావేశం కానుంది. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్‌లో ఈ భేటీ జరగనుంది. త్వరలో జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై కేబినెట్‌ ప్రధానంగా చర్చించనుందని సమాచారం. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం తొలిసారి మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. దుబ్బాక ఫలితాలపై కూడా ఈ సమావేశంలో సీఎం చర్చించే అవకాశం ఉంది.

ఓటమికి గల కారణాలను మంత్రులతో కలిసి విశ్లేషించనున్నారు. అలాగే పట్టభద్రుల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానానికి అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు జరిపే అవకాశం ఉంది.

మరోవైపు, దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి వేళ సీఎం కేసీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో కీలక సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులతో పాటు ఉపసభాపతి పద్మారావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. దుబ్బాకలో ఓటమికి గల కారణాలపై నేతలతో కేసీఆర్‌ పూర్తిస్థాయిలో సమీక్షిస్తున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ వ్యతిరేక ఫలితం రావడంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img