Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ఏ ఒక్కరి వల్ల రాలేదు : Revanth Reddy

తెలంగాణ ఏ ఒక్కరి వల్ల రాలేదు : Revanth Reddy

  • సబ్బండవర్గాలు పోరాడితే వచ్చింది
  • బడుగు, బలహీన వర్గాలు రక్తం చిందించారు
  • ఉద్యోగుల డీఏ గురించి అసెంబ్లీలో చర్చిస్తాం
  • మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం
  • ఉద్యోగసంఘాలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరివల్లా రాలేదని.. సబ్బండ వర్గాలు కృషి చేస్తేనే వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్వరాష్ట్రం కోసం సబ్బండ వర్గాల ప్రజలు ఎంతో పోరాటం చేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు ఉద్యమంలో రక్తం చిందించారని చెప్పారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. కార్యక్రమంలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీజీవో, టీఎన్‌జీవో, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ సంఘాల నేతలు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. డీఏ, ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామన్నారు. పదేళ్లుగా ప్రభుత్వానికి సమస్యలు విన్నవించే అవకాశం తెలంగాణలో ఉద్యోగులకు రాలేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Recent

- Advertisment -spot_img