HomeరాజకీయాలుTelangana Elections : గజ్వేల్​లో CM KCR నామినేషన్

Telangana Elections : గజ్వేల్​లో CM KCR నామినేషన్

– సిద్ధిపేట, సిరిసిల్ల నుంచి

నామినేషన్లు వేసిన మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్


ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. గజ్వేల్ సెగ్మెంట్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కేసీఆర్.. ఆర్వో ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పేపర్లను అందజేశారు. నామినేషన్‌ అనంతరం కేసీఆర్‌ ప్రచార వాహనం పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు. కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్.. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నామినేషన్‌ దాఖలు చేశారు. మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక ఆర్డీవో ఆఫీసులో ఆ పేపర్లను రిటర్నింగ్‌ అధికారికి ఆయన సమర్పించారు. సిరిసిల్ల సెగ్మెంట్ నుంచి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త‌న నామినేష‌న్ పేపర్లను ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి అందజేశారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఐదోసారి బ‌రిలో నిలిచారు. నామినేష‌న్ దాఖ‌లు కంటే ముందు కేటీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. మంత్రులు జగదీశ్​ రెడ్డి సూర్యాపేట నుంచి, మంత్రి శ్రీనివాస్​గౌడ్ మహబూబ్​నగర్ నుంచి నామినేషన్లు వేశారు.

Recent

- Advertisment -spot_img