HomeరాజకీయాలుTelangana Elections : నో డౌట్​ .. మళ్లీ కేసీఆరే సీఎం

Telangana Elections : నో డౌట్​ .. మళ్లీ కేసీఆరే సీఎం

– ఎంపీ మాలోతు కవిత

ఇదేనిజం, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆరే సీఎం కాబోతున్నారని ఎంపీ మాలోతు కవిత పేర్కొన్నారు. తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కురవిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 21వ తేదీన కురవిలో సీఎం కేసీఆర్‌ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. గిరిజనులకు ప్రత్యేక గ్రామపంచాతీలను ఏర్పాటు చేసిన కేసీఆర్‌, ఎంతో మంది గిరిజనులు సర్పంచులు, ప్రజాప్రతినిధులుగా అయ్యేందుకు అవకాశం కల్పించారన్నారు. ఈనెల 11న హైదరాబాద్‌ శామీర్‌పేటలో రాష్ట్రస్థాయి గిరిజన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, గిరిజనులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

Recent

- Advertisment -spot_img