– ఎన్నికల వేళ గట్టి షాక్
– మునుగోడు టికెట్ దక్కకపోవడంతో మనస్తాపం
– త్వరలో బీఆర్ఎస్లోకి..
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: పాల్వాయి స్రవంతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీకి గట్టి షాక్ తగిలినట్టైంది. గత ఉప ఎన్నికల్లో ఆమె మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టికెట్ అతడికే వచ్చింది. దీంతో స్రవంతి రెడ్డి మనస్తాపంతో ఉన్నారు. పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. తొలత ఆమె ఖండించారు. అయితే తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ.. నాలుగు పేజీల లేఖను అధిష్ఠానానికి పంపారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు.