HomeరాజకీయాలుTelangana Elections : షర్మిల.. బ్యాక్​ స్టెప్​

Telangana Elections : షర్మిల.. బ్యాక్​ స్టెప్​

– తెలంగాణలో పోటీకి వైఎస్సార్టీపీ దూరం
– కాంగ్రెస్​ పార్టీకి మద్దతు
– హస్తం పార్టీ గెలిచే అవకాశం ఉందని షర్మిల కామెంట్​
– అడ్డుపడకూడదనే పోటీ నుంచి విరమించుకున్నట్టు ప్రకటన

ఇదేనిజం, హైదరాబాద్​: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ గెలుపొందే అవకాశం ఉందని.. ఆ పార్టీ గెలుపును అడ్డుకోకూడదనే తాము పోటీ నుంచి తప్పుకున్నట్టు పేర్కొన్నారు. తాను పాలేరు బరిలో దిగాలని భావించానని.. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఉన్న అనుబంధంతో ఆ సీటును త్యాగం చేయాలని భావించినట్టు ఆమె చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వం మారే అవకాశం ఉన్నప్పుడు అడ్డుపడటం సరికాదని .. తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశామన్నారు. షర్మిల తెలంగాణలో సుధీర్ఘ పాదయాత్ర చేశారు. కాంగ్రెస్​ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించారు కూడా.. అయితే వివిధ కారణాల వల్ల ఆపార్టీ పొత్తు కు అంగీకరించలేదు. దీంతో షర్మిల చివరకు పోటీ నుంచే తప్పుకున్నారు.

Recent

- Advertisment -spot_img