మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని సరికొత్తగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మహిళా సంఘ సభ్యులకు యూనిఫామ్ చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఉచితంగా ఈ యూనిఫామ్ చీరలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం చీరల డిజైన్లు ప్రత్యేకంగా రూపొందించినట్లుగా తెలుస్తుంది. సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఈ డిజైన్లను మంత్రి సీతక్కకు చూపించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ డిజైన్లు తుది రూపంలో ఖరారు చేయనున్నారు. అంతా ఒకే అయితే మహిళలకు మరో కొత్త కానుక అందినట్లే అవుతుంది.