Homeహైదరాబాద్latest Newsరుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్..

రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్..

మంత్రి తుమ్మల నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నందిపేట్ మండలం ఆంధ్రనగర్‌లో నూతన ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు అని కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. ఎన్టీఆర్ తనకు నేటికీ ఆదర్శప్రాయుడని తుమ్మల వ్యాఖ్యనించారు.

ALSO READ: BRSకు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి చేరిన నలుగురు కీలక నేతలు

కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీలతోపాటు అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేస్తుందని హామీ ఇచ్చారు. రైతు బంధురాని రైతులు ఏమాత్రం దిగులు చెందకూడదని.. ఈ నెలాఖరులోపు రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాలోకి జమ చేస్తామని వివరించారు. రెండు లక్షల రైతు రుణమాఫీని దశలవారీగా నిధులను విడుదల చేసి హామీని నిలబెట్టుకుంటామన్నారు. కాంగ్రెస్ పథకాలను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తుందన్నారు.

ALSO READ: వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇళ్లు లేని వారికి రూ.5లక్షలు

Recent

- Advertisment -spot_img