Homeహైదరాబాద్latest NewsTelangana Inter Results 2025: తెలంగాణ ఇంట‌ర్ ఫలితాల్లో మరోసారి బాలిక‌ల‌దే పైచేయి..!

Telangana Inter Results 2025: తెలంగాణ ఇంట‌ర్ ఫలితాల్లో మరోసారి బాలిక‌ల‌దే పైచేయి..!

Telangana Inter Results 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలు ఈ ఏడాది కూడా ఆధిపత్యం చాటారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 65.96% ఉత్తీర్ణత నమోదు కాగా, బాలికలు 73.83%, బాలురు 57.83% ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 65.65% ఉత్తీర్ణత నమోదైంది, ఇందులో బాలికలు 74.21%, బాలురు 57.31% ఉత్తీర్ణత పొందారు. ఈ ఫలితాలు బాలికల విద్యాపరమైన శ్రేష్ఠతను మరోసారి రుజువు చేశాయి.

Recent

- Advertisment -spot_img