HomeతెలంగాణJatara : తెలంగాణాలో జాత‌ర‌ల పూర్తి వివ‌రాలు

Jatara : తెలంగాణాలో జాత‌ర‌ల పూర్తి వివ‌రాలు

Jatara : తెలంగాణాలో జాత‌ర‌ల పూర్తి వివ‌రాలు

Jatara : తెలంగాణ ప్రాంతంలోని జాతరలన్ని జానపదుల జీవన విధానానికి, విశ్వాసాలకు, ధార్మిక జీవనానికి అద్దం పడుతుంది

తెలంగాణలోని పల్లెపల్లెలో జాతరలు జరుగుతాయి అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి

జానపదులు ప్రసిద్ధమైన వాటిలో అధిక సంఖ్యలో పాల్గొంటారు.

సమ్మక్క – సారక్క జాతర 

సమ్మక్క సారక్క జాతర అనేది వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర

వరంగల్ నుండి 110 K.M దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండాకోనల మధ్య ఈ చరిత్రతాత్మక జాతర జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండ పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్. ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి లక్షలమంది భక్తులు హాజరవవుతారు.

చారిత్రిక నేపథ్యం

సమ్మక్క భర్త పగిడిద్ద రాజు

ఇతను మేడారంలో స్థానిక గిరిజన గ్రామాల నుంచి పన్ను వసూలు చేసి తమ పాలకుడైన రెండవ ప్రతాపరుద్రునికి పంపించేవాడు.

పగిడిద్ద రాజు, సమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలరు

కుమార్తెలు — సారలమ్మ (భర్త -గోవిందరాజు), నాగులమ్మ

కుమారుడు – జంపన్న

1996లో అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించింది.

మేడారంలో కరువు సంభవించిన కారణంగా ప్రజలు పన్ను చెల్లించలేకపోయారు.

కానీ రెండవ ప్రతాపరుద్రుడు పన్ను చెల్లించాలిసిందిగా ఆదేశించాడు.

దీనిని వ్యతిరేకించిన మేడారం ప్రజల పైకి సైన్యాన్ని పంపాడు.

దీంతో పగిడిద్ద రాజు స్థానిక గిరిజనులను ఏకం చేసి రెండవ ప్రతాపరుద్రుడి సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. 

కానీ ఈ యుద్ధంలో పగిడిద్ద రాజు అల్లుడు గోవిందరాజు మరణించాడు.

కుమారుడైన జంపన్న యుద్ధభూమిలో సైన్యాన్ని వీరోచితంగా ఎదుర్కొని తీవ్ర గాయాలయ్యాడు

సైన్యం చేతిలో చావటానికి ఇష్టపడని జంపన్న ప్రక్కనే ఉన్న సంపెంగ వాగు లోకి దూకి మరణించాడు

సంపెగ వాగు లో జంపన్న దూకిన వెంటనే అందులోని నీరంతా అతని రక్తంతో కలిసి ఎర్రగా మారింది. అప్పటి నుంచి సంపెంగ వాగుకు జంపన్న వాగు అనే పేరు వచ్చింది.

వీరి మరణం తరువాత సమ్మక్క, సారలమ్మ  కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొనుటకు ఆయుధాలతో యుద్దభూమికి బయలుదేరారు.

యుద్ధభూమిలో సారలమ్మ హతమార్చ బడింది.  కానీ సమ్మక్క మాత్రం వీరోచిత పోరాటం చేసి రెండవ ప్రతాపరుద్రుడు సైన్యాన్ని హతమార్చుకొంటు ముందుకు కొనసాగింది.

దీనితో 2వ ప్రతాపరుద్రుడు సైన్యాధిపతి అయిన గన్నామ నాయక లేదా యుగంధర్ భయాందోళనకు గురైనారు. అప్పటికే వందలకొలది సైనికులు హతమార్చబడ్డారు.

యుద్ధభూమిలో సైనికులు తన చేతిలో హతమవుతుంటే వారి కుటుంబాలన్నీ వీడిన పడతాయని భావించిన సమ్మక్క సైనికులను హతమార్చడం ఇష్టం లేక యుద్దభూమి నుంచి వెళ్ళిపోయింది.

సమ్మక్క  యుద్ధ భూమి సమీపంలో గ చిలుకల గుట్ట పైకి వెళ్లి మాయమైంది.

సమ్మక్క అదృష్టమైన స్థలంలో ఒక కుంకుమ భరిణెనను సమ్మక్క ప్రతిరూపంగా భావించి స్థానిక గిరిజనులు పండుగ చేయడం ప్రారంభించారు. ఆ పండుగే నేడు సమ్మక్క సారక్క జాతరగా [ప్రసిద్ధి చెందింది

సమ్మక్క సారలమ్మ జాతరను దక్షిణ భారతదేశ కుంభమేళాగా పరిగణిస్తారు.

మేడారం జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.

అలహాబాద్ కుంభమేళా తరువాత అత్యధిక జనం వచ్చే జాతర మేడారం జాతర.

సమ్మక్క సారక్క జాతర విశేషాలు 

జాతర మొదటి రోజున   ‘కన్నెపల్లి’ నుంచి సారలమ్మను గద్దెకు తీసుకు వస్తారు.

రెండవ రోజున చిలుకలగుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు  గద్దెలపై ప్రతిష్టించే సమయంలో భక్తులు పూనకం తో ఊగి పోతారు.

మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు.

నాల్గవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యుద్ధ స్థలానికి తరలిస్తారు.

వంశపారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత.

తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు.

గిరిజన పల్లె కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు.

నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు సుమారు కోటి మంది పైగా వస్తారు.

ఈ జాతరను ఆసియా లోని అతి పెద్ద జాతరగా UNESCO గుర్తించింది.

ముత్యాలమ్మ జాతర 

ఈ ముత్యాలమ్మను పోచమ్మ అని కూడా పిలుస్తారు

ముత్యాలమ్మ గ్రామా ప్రజల రాక్షుకురాలని, స్త్రీలకు సంతానం ఇస్తుందని, ఆమెను సేవిస్తే పంటలు బాగా పండుతాయని, బోనాలు పండుగ చేస్తే పిల్ల పాపలు సుఖంగా ఉంటారని ప్రజల యొక్క విశ్వాసం.

ప్రధానంగా ఈ పండుగను నల్గొండ జిల్లాలోని అనేక గ్రామాలలో శ్రావణమాసంలో కొలుస్తారు.

ఈ జాతర బియ్యం కొలతతో ప్రారంబమవ్వుతుంది.

ఈ కార్యక్రమంలో ప్రధాన సూత్రదారి ‘బలనీడు’

జాతరను చేయడానికి పశువును బలి ఇవ్వడానికి వచ్చేవాళ్లను ‘ఆచారమంతులు’ అంటారు.

ఈ జాతరలో ప్రధాన ఘట్టాలు శిడిమాను, పూలకప్పెర, పోలి. బలి ఇచ్చిన మేకపోతు ప్రేగులను ‘బలనీడు’ దరిస్తాడు.

మైసమ్మ జాతర

ఈ జాతరను 3 లేదా 5 లేదా 7 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు.

ఇది ప్రధానంగా శ్రావణమాసంలో జరుపుకునే పండుగ

గంగా దేవమ్మ జాతర 

నల్గొండ జిల్లాలోని నూతనకల్లు మండలంలోని బిక్కుమల్ల గ్రామంలో గంగాదేవమ్మ ఆలయం ఉన్నది

ఇక్కడ జాతరను మాసనపల్లి యాదవులు నిర్వహిస్తారు

కనకదుర్గమ్మ జాతర 

ఈ జాతర అడవిదేవరపల్లి గ్రామంలో వైభవంగా నిర్వహిస్తారు. ఈ గ్రామం దామరచర్ల మండలంలో ఉన్నది

దీనిలో సిడిమాన్ ఊరేగింపు, బండ్ల ఊరేగింపు, గండ దీపం ప్రత్యేకమైన కార్యక్రమాలు

మారమ్మతల్లి జాతర 

ఈమె పిల్లలకు పశువులకు ఆరాధ్య దేవత

ఈ జాతరను నల్గొండ జిల్లాలోని రామన్నపేట తాలూకా లోని వెలువర్తి, పిట్టంపల్లి గ్రామాలలో ఘనంగా నిర్వహిస్తారు.

చౌడమ్మ జాతర 

ఈ జాతరను సూర్యాపేట జిల్లాలో  ప్రజలు మూడు రోజులపాటు జరుపుతారు

చౌడమ్మ యాదవుల కుల దేవత

కేవలం సూర్యాపేట జిల్లాలో మాత్రమే ఈ దేవత గుడులు కలవు

కొండగట్టు జాతర

కరీంనగర్ జిల్లాలోని ముత్యంపేట దగ్గర ఉన్నది

హనుమంతుడు ఒక వైపు నరసింహస్వామి ముఖంతో, మరోవైపు ఆంజనేయునిస్వామి ముఖంతో ఉండటం దీని ప్రత్యేకత.

ఈ గుడిలో 40 రోజులపాటు పూజలు చేయడం వల్లన సంతానం కలుగుతుంది అని ప్రజల విశ్వాసం.

పాలశేర్లయ్య గట్టు / గొల్లగట్టు జాతర

తెలంగాణ ప్రజలు పెద్దగట్టు జాతర గా పిలుచుకునే ఈ జాతరను సూర్యాపేట జిల్లాలో పోలశేర్లయ్య గట్టు మీద ఘనంగా నిర్వహించబడుతుంది

ఇది తెలంగాణాలో రెండవ అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది.

ఈ జాతరను 2 సంవత్సరాలకు ఒక సారి నిర్వహిస్తారు.

దిష్టి పొయ్యటం అనే ఆచారం గొల్లగట్టు జాతరలో అతి ప్రధానమైన అంశంగా పేర్కొంటారు.

గొల్లగట్టు జాతర సందర్భంగా 20 విగ్రహాలు ఉండే దేవర  పెట్టెను కేసారం గ్రామానికి తీసుకెళ్లి హక్కుదారులకు చూపించి పూజలు చేస్తారు. ఆ తరువాత లింగమంతుల స్వామి తోబుట్టువు అయిన చౌడమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తారు. ఖాసీంపేట యాదవ కులం వారు ఈ జాతరలో పసిడి కుండను ఆలయ గోపురంపై అలంకరిస్తారు.

సూర్యాపేట యాదవ కులస్తులు స్వామికి మకర తోరణాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు.

సాయంత్రం భోజనాలు ముగించిన తరువాత గండదీపం వెలిగిస్తారు.

తరువాత మరుసటి రోజు పోతురాజు తదితర దేవుళ్ళకు మొక్కులు చెల్లిస్తారు, దీనితో జాతర పూర్తవుతుంది.

ఏడుపాయల జాతర 

మెదక్ జిల్లాలోని వనదుర్గాభవాని దేవాలయం ఏడుపాయల జాతరకు ప్రసిద్ధి.

ఈ దేవాలయం మంజీరా నది ఏడుపాయలుగా చీలిపోయే చోట నిర్మించబడింది. అందువల్లనే ఏడుపాయల జాతరగా ప్రసిద్ధి చెందినది

ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు నుంచి మూడు రోజులపాటు ఈ జాతరను నిర్వహిస్తారు.

నాగోబా జాతర 

ఆదిలాబాద్ ఇంద్రవెల్లిలో గల కేస్లాపూర్ లో జరుగుతుంది.

ఈ జాతరలో నాగ దేవతను ఆరాధిస్తారు.

యాలాల జాతర 

ఆదిలాబాద్ లోని చెన్నూరు మండలంలో జరుగుతుంది

కొమురవెల్లి జాతర 

వరంగల్ లో జరుగుతుంది.

మల్లికార్జునస్వామిని పూజిస్తారు

రాజన్న జాతర

వేములవాడలో జరుగుతుంది.

రాజరాజేశ్వరున్ని ఆరాధిస్తారు.

Recent

- Advertisment -spot_img