తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఉద్యమ పార్టీ అంటూ చెప్పుకుంటున్న బీఆర్ఎస్ అయితే లోక్‌సభ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయింది. దీంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి సమానంగా పట్టంకట్టారు. అయితే మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నాయకులకు ప్రజలు పట్టం కట్టారు. వారిని అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకపోయినా సరే.. పార్లమెంట్‌లో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చారు. వీరంతా బీజేపీ నాయకులే కావడం విషేశం. గతంలో వీరిని ఛీ కొట్టిన ప్రజలే.. లోక్‌సభ ఎన్నికల్లో వారికి ఎంపీ పీఠాన్ని ఎక్కించారు.