Homeవిద్య & ఉద్యోగంతెలంగాణ ఉద్యమం సంక్షిప్త సమాచారం – 9

తెలంగాణ ఉద్యమం సంక్షిప్త సమాచారం – 9

02 జనవరి 2010:

తెలంగాణ వ్యాప్తంగా జేయేసీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీలు, ప్రదర్శనలు, సభలు మరియు సమావేశాలు.

కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని పట్టణ చౌరస్తాలో వెలాది మంది విద్యార్ధుల ర్యాలి, బహిరంగ సభ. హాజరైన జేయేసీ నాయకులు మల్లెపల్లి లక్ష్మయ్య, పిట్టల రవీందర్‌.

03 జనవరి 2010:

ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో తెలంగాణ విద్యార్థి గర్జన.

 అన్ని ప్రాంతాల నుండి తరలివచ్చిన లక్షలాది మంది విద్యార్థులు. హాజరైన అన్ని పార్టిల నాయకులు.

05 జనవరి 2010

ఢిల్లీలో హోంమంత్రితో 8 పార్టీల నెతల బేటి. రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దాలని, ఆందోళనలకు స్వస్తి పలికి శాంతియుత వాతావరణం నెలకొనెలా చూడాలని అన్ని పార్టల ఏకాభిప్రాయం.

హేతుబద్ద వ్యవధిలోపు చర్చలకు అన్ని పార్టిలు అంగీకరించాయి.

12 జనవరి 2010:

బంజారహిల్‌లోని రావి నారాయణరెడ్డి మెమోరియల్‌ హాల్‌లో తెలంగాణ జేయేసీ సమావేశం.

రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు, ఉద్యమకారుల డిమాండ్‌. అర్భాంతరంగా ముగిసిన సమావెశం.

13  జనవరి 2010:

సోమాజీగూడలోని ఎన్‌కెఎం గ్రాండ్‌ హోటల్‌లో తెలంగాణ జేయేసి స్టిరింగ్‌ కమిటి సమావేశం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టల భాగస్వామ్యంతో  ఇందిరాపార్కు వద్ద రిలే దీక్షలు కొనసాగించాలని నిర్ణయం.

16 జనవరి 2010;

తెలంగాణ జేయేసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్‌తో రిలే దీక్షలు ప్రారంభం. హాజరైన అన్ని పార్టీల నాయకులు.

25 జనవరి 2010:

న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ శాసన సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసం (క్వార్టర్‌ నెం. 188)లో తెలంగాణ జేయేసీ కార్యాలయం ప్రారంభం.

27 జనవరి 2010:

న్యూఎమ్మెల్యె క్వార్టర్స్‌లోని జేయేసీ కార్యాలయంలో రాత్రి 8 గంటలకు తొలిసారి సమావేశం నిర్వహించుకున్న తెలంగాణ జేయేసీ స్టిరింగ్‌ కమిటి.

28 జనవరి 2010:

తెలంగాణ జేయేసీ స్టిరింగ్‌ కమిటిలో భాగంగా ప్రముఖులతో జేయేసీ వర్మింగ్‌ గ్రూప్‌ ఎర్పాటు.

ఇందిరా పార్కు వద్ద జేయేసీ ఆధ్వర్యంలో 13 రోజుల పాటు కొనసాగిన రిలె నిరాహార దీక్షల ముగింపు.

ఫిబ్రవరి 1 నుండి అన్ని జిల్లాలలో నిరవధిక రిలె నిరాహారదీక్షలు చేపట్టాలని బేయేసీ స్టీరింగ్‌ కమిటి నిర్ణయం.

మరిన్ని..

తెలంగాణ ఉద్యమం మరోసారి నెమరేద్దాం.. పార్ట్​ 1

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2009 ‌‌- 2

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 3

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 4

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2012 ‌‌- 5

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2013 ‌‌- 6

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2014 ‌‌- 7

తెలంగాణ ఉద్యమం సంక్షిప్త సమాచారం – 8

Recent

- Advertisment -spot_img