రాఖీ పూర్ణిమ పండగ వేళ తెలంగాణ ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. రాఖీ రోజు రికార్డు స్థాయిలో 63 లక్షల మంది ప్రజలు TGSRTC బస్సుల్లో ప్రయాణించారని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. వీరిలో 41.74 లక్షల మంది మహిళలు ఉన్నారన్నారు. “రాఖీ నాడు రూ.32 కోట్ల వరకు రాబడి వచ్చింది. అందులో మహాలక్ష్మి పథకంతో రూ.17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా రూ.15 కోట్లు వచ్చాయి. ఆర్టీసీ చరిత్రలో ఇది ఆల్ టైం రికార్డు” అని చెప్పారు.