Homeహైదరాబాద్latest Newsఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఇదే నిజం, హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కన్నపేట మండల అధ్యక్షుడు జంగపెల్లి ఐలయ్య అధ్వర్యంలో అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…60 ఏళ్ల కలను సాకారం చేసిన సోనియా గాంధీ కి ధన్యవాదాలు తెలిపారు. పదేండ్ల పాలనలో రాష్ట్రం ను దివాలా తీసిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందని అన్నారు. ఇప్పడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని, రాబోయే రోజుల్లో మన హుస్నాబాద్ నియోజక వర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్వర్యంలో ఎంతో అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట తాజా మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img