Homeహైదరాబాద్latest Newsరేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల

రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల

తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. 10వ తరగతి పరీక్షా ఫలితాలను రేపు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://results.bsetelangana.org/ నుండి చూసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img