Homeహైదరాబాద్latest Newsకాసేపట్లో తెలంగాణ టెన్త్ ఫలితాలు

కాసేపట్లో తెలంగాణ టెన్త్ ఫలితాలు

నేడు తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. 10వ తరగతి పరీక్షా ఫలితాలను నేడు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://results.bsetelangana.org/ నుండి చూసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img