అమెరికాలో దొంగతనం చేస్తూ హైదరాబాద్, గుంటూరుకు చెందిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు పట్టుబడ్డారు. న్యూజెర్సీలోని హోబోకెన్లోని ఓ షాపులోకి వెళ్లి కొన్ని వస్తువులకు బిల్లు కట్టకుండా (షాప్ లిఫ్టింగ్) నొక్కేసే ప్రయత్నం చేశారు. షాప్ యాజమాని అది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చి సీసీ ఫుటేజీ పరిశీలించగా నిజమని తేలింది. మార్చి 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.