తెలంగాణ వ్యాప్తంగా ‘ఒకే రాష్ట్రం, ఒకే పోలీస్ విధానం’ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూనిఫామ్ వేసుకుని అన్ని బెటాలియన్లలో పోలీస్ కానిస్టేబుల్స్ ఆందోళన చేస్తున్నారు. నిన్నటివరకు బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యులు రోడ్లపై నిరసన వ్యక్తం చేయగా, శనివారం కానిస్టేబుళ్లు ప్రత్యక్షంగా ఆందోళన దిగడంతో రాష్ట్రం దద్దరిల్లుతోంది. ఈ ఆందోళనలపై డీజీపీ జితేందర్ స్పందించారు. ధర్నాలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామమన్నారు.