Homeహైదరాబాద్latest Newsభయంకరమైన ఆక్సిడెంట్.. నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు కదరా.. నడుస్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన కారు...

భయంకరమైన ఆక్సిడెంట్.. నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు కదరా.. నడుస్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన కారు (VIDEO)

మేడ్చల్ జిల్లా, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో భయంకరమైన ఆక్సిడెంట్ సంభవించింది. అతివేగంతో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కారులో వస్తున్నారు.. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును కారు ఢీకొట్టింది. గోపి (38) అనే సెక్యూరిటీ గార్డు స్పాట్ లోనే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘోర ప్రమాదం.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని.. తాగి డ్రైవ్ చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img