HomeజాతీయంTerrorist attack : శ్రీనగర్‌లో హాస్పిటల్లో టెర్రరిస్టుల కాల్పులు

Terrorist attack : శ్రీనగర్‌లో హాస్పిటల్లో టెర్రరిస్టుల కాల్పులు

Terrorists fire at security forces at SKIMS Medical College Hospital in Srinagar : శ్రీనగర్‌లో స్కీమ్స్ హాస్పిటల్లో టెర్రరిస్టుల కాల్పులు (Terrorist attack)

శ్రీనగర్‌లోని స్కిమ్స్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వద్ద భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

జమ్మూకాశ్మీర్ లోని ఎస్‌కెఐఎంఎస్ మెడికల్ కాలేజీలో ఉగ్రవాదులు దాడికి దిగారు. అయితే ఉగ్రవాదుల దాడిని ఆర్మీ తిప్పికొట్టింది. పౌరులను అడ్డుపెట్టుకొని ఉగ్రవాదులు తప్పించుకొన్నారు.

బెమీనాలోని SKIMS ఆసుపత్రిలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయి.  

సామాన్యులను అడ్డు పెట్టుకొని ఉగ్రవాదులు తప్పించుకొన్నారని సమాచారం.

ఉగ్రవాదులు కాల్పులు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు.

అయితే ఈ ఆసుపత్రిని భద్రతా బలగాలు చుట్టుముట్టారు.

భారీగా భద్రతా బలగాలు ఆసుపత్రిని చుట్టుముట్టడంతో టెర్రరిస్టులు అక్కడి నుండి తప్పించుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు.

అయితే ఆసుపత్రికి వచ్చిన సాధారణ పౌరులను అడ్డుపెట్టుకొని ఉగ్రవాదులు ఆసుపత్రి నుండి పారిపోయారు. 

జమ్మూ కాశ్మీర్ లో ఈ దాడి ఈ నెలలో ఇది మొదటిది.

గత అక్టోబర్ మాసంలో ఉగ్రవాదులు ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు 11 మంది పౌరులను చంపారు.

కాశ్మీర్ లోయలో యాంటీ టెర్రర్ ఆపరేషన్  కొనసాగుతుంది.పూంచ్ జిల్లాలో ఉగ్రమూకల ఏరివేత కోసం భద్రతా దళాలు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి.

ఈ ఆపరేషన్స్ లో  కీలకమైన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

మరోవైపు భద్రతా దళాల వైపు కూడా ప్రాణనష్టం చోటు చేసుకొంది.

Recent

- Advertisment -spot_img