సైబర్ నేరాలకు సంబంధించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) పోలీసులు బిగ్ ఆపరేషన్‌ను చేపట్టారు. మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో సెర్చ్ ఆపరేషన్‌లు నిర్వహించారు. ఇందులో భాగంగా భారీ సంఖ్యలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో నేరస్థుల డేటాను TGCSB డైరెక్టర్ శిఖా గోయల్.. మీడియాకు తెలుపనున్నారు.