Homeహైదరాబాద్latest Newsమృగశిర కార్తె స్పెషల్..చేప ప్రసాదం పంపిణీ..ప్రత్యేక సర్వీసులు

మృగశిర కార్తె స్పెషల్..చేప ప్రసాదం పంపిణీ..ప్రత్యేక సర్వీసులు

మృగశిర కార్తె సందర్భంగా ఈనెల 8న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఆస్తమా బాధితులు పెద్దమొత్తంలో తరలివచ్చే అకాశం ఉండటంతో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 8,9 తేదీల్లో 130 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ తెలిపింది. సికింద్రాబాద్, కాచిగూడ, జూబ్లీహిల్స్, ఎంజీబీఎస్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొంది.

బత్తిని బ్రదర్స్ ఏటా ఈ చేప మందును పంపిణీ చేస్తున్నారు. కేవలం హైదరాబాద్ నుంచే గాక రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తుంటారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు దాదాపు 2 లక్షల మంది వస్తుంటారు. చేప ప్రసాదం పంపిణీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img