Homeఆంధ్రప్రదేశ్ఆ కోడి నాదే..

ఆ కోడి నాదే..

  • ఓ వ్యక్తి వీడియో వైరల్
  • వేలాన్ని నిలిపేసిన ఆర్టీసీ అధికారులు

కరీంనగర్ ఆర్టీసీ అధికారులు కోడి వేలాన్ని రద్దు చేసుకున్నారు. మూడు రోజుల క్రితం కరీంనగర్ బస్టాండ్ లో పందెంకోడిని వదిలి వెళ్ళగా, ఆర్టీసీ అధికారులు కోడికి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వేలం వేయాలని నిర్ణయించారు. ఆ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ కోడి తనదేనంటూ ఓ వ్యక్తి పెట్టిన వీడియో వైరల్ అయింది. ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి మండలానికి చెందిన వల్లపు మహేష్ సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో మేస్త్రీగా పని చేస్తున్నాడు. సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లే క్రమంలో కోడిని కరీంనగర్ లో మర్చిపోయినట్టు వీడియోలో తెలిపాడు. దానికి టికెట్ కూడా తీసుకున్నట్టు చెప్పాడు. ఎట్టి పరిస్థితిలో కోడిని వేలం వేయవద్దని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అవి అధికారులకు చూపిస్తానని తెలిపాడు. అయితే, జంతు, పక్షి సంరక్షణ నియమం మేరకు ఆ కోడిని పక్షి, జంతు సంరక్షణ శాఖకు అప్పజెప్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. వేలాన్ని రద్దు చేసినట్టు శుక్రవారం మరో ప్రకటనను ఆర్టీసీ అధికారులు విడుదల చేశారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరారు. సాయంత్రం నాలుగు గంటలకు కోడిని బ్లూ క్రాస్ సొసైటీకి ఆర్టీసీ అధికారులు అప్పజెప్పారు.

Recent

- Advertisment -spot_img