Homeసినిమాఅందుకే రెమ్యునరేషన్ తీసుకోలేదు..

అందుకే రెమ్యునరేషన్ తీసుకోలేదు..

హీరో శివకార్తికేయన్‌ నటించిన లేటెస్ట్ మూవీ అయలాన్‌. రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ఆర్‌.రవికుమార్‌ డైరెక్ట్ చేశాడు. కేజేఆర్‌ స్టూడియోస్‌ పతాకంపై కొటపాటి జయం రాజేశ్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్‌.రెహమాన్‌ మ్యూజిక్ అందించాడు. సంక్రాంతి కానుకగా.. జనవరి 12న సినిమా రిలీజ్​ కానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం మూవీ ప్రీ రిలీజ్​ ప్రోగ్రామ్​ను చెన్నైలో నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మాత మాట్లాడుతూ.. తెలుగులో బాహుబలి, కన్నడంలో కేజీఎఫ్‌ చిత్రాల మాదిరి తమిళంలో అయలాన్‌ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. హీరో శివకార్తికేయన్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఎలాంటి హింసాత్మక సన్నివేశాలు ఉండవన్నారు. కుటుంబంతో కలిసి ఆనందించే విధంగా అయలాన్‌ ఉంటుందన్నారు. రెహమాన్​ మ్యూజిక్​ డైరెక్షన్​లో ఓ సినిమా చేయాలన్న తన కల నెరవేరిందన్నారు. దురదృష్టవశాత్తు నిర్మాణంలో నిర్మాతకు పలు సమస్యలు ఎదురయ్యాయని, వాటిని అధిగమించడానికి తాను రెమ్యునరేషన్​ను సైతం తీసుకోలేదన్నారు. సినిమాను ఎలాగైనా పూర్తి చేయమని చెప్పానన్నారు. జనవరి 5న ట్రైలర్​ను రిలీజ్​ చేయనున్నట్లు శివకార్తికేయన్‌ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img