Homeహైదరాబాద్latest Newsతహసీల్దార్ కి వినతి పత్రం అందజేసిన బీజేపీ శ్రేణులు

తహసీల్దార్ కి వినతి పత్రం అందజేసిన బీజేపీ శ్రేణులు

ఇదే నిజం, ధర్మపురి/ఎండపల్లి: శుక్రవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి బీజేపి మండల శాఖ తరపున ఎమ్మార్వో కి వడ్లు కొనాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధర్మపురి అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు మాట్లాడుతూ.. గత 40 రోజులు నుండి ఐకేపి కేంద్రములో పోసిన వడ్లను కొనుగోలు చేయడం లేదు, తప్ప తాలు అని కోత పెడుతున్నారు, తూకం వేసిన బస్తాలు కూడా లారీ దొరకడం లేదని కాలయాపన చేస్తున్నారని, అకాల వర్షాల వలన రైతన్నలు నష్టపోతున్నారని చెప్పడం జరిగింది. రైతు లేనిదే రాజ్యం లేదని సామెత తప్ప నిజ జీవితంలో రైతు సమస్యలను పట్టించుకొనే అధికారులు , నాయకులు లేరని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రావు హనుమంతరావు, ధర్మపురి అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు, ప్రధాన కార్యదర్శులు పొన్నం నరేష్ గౌడ్, మంచికట్ల రవి, ఉపాధ్యక్షులు గోపణవేని గంగచలం యాదవ్, జిల్లా దళిత మోర్చ ఉపాధ్యక్షులు దుర్గం రమేష్, బిజేవైయం అధ్యక్షులు జక్కుల సాగర్ యాదవ్, కిసాన్ మోర్చ అధ్యక్షులు కొయ్యడ రజినీకాంత్,ఓబీసీ మోర్చ అధ్యక్షులు దివాకర్ గౌడ్, కోశాధికారి పోచంపల్లి శ్రీధర్, మండల కార్యధర్శులు పొన్నం కిరణ్ గౌడ్, కోదురుపాక అశోక్, జిల్లా నాయకులు బండి రవీందర్,శక్తి కేంద్రం ఇన్చార్జి మేడిపల్లి రామాంజనేయులు, బూత్ అధ్యక్షులు మెరుగు తిరుపతి, నాయకులు తిరుమల ప్రమోద్ , అల్లంల సంజీవ్ ,గంగుల సతన్న పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img