మలయాళ నటుడు, ఫహాద్ ఫాజిల్‌పై కేరళ మానవ హక్కుల సంఘం సుమోటో కేసు నమోదు చేసింది. అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం రాత్రంతా ‘పింకేలీ’ అనే సినిమా కోసం షూటింగ్ చేశారు. దీంతో అక్కడున్న రోగులంతా ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రి లోపలికి ఎవరినీ అనుమతించకుండా అత్యవసర విభాగం అనుమతి తీసుకోకుండా షూటింగ్ చేశారనేది ఆరోపణ వస్తున్నాయి.