Sovereign Gold Bond Scheme : నేడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో మిడిల్ క్లాస్ ప్రజలకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. సావరిన్ గోల్డ్ బాండ్ (Sovereign Gold Bond Scheme) పథకాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం అని తెలుస్తుంది. 2015లో ప్రారంభించిన ఈ పథకం ప్రధాన లక్ష్యం బంగారం దిగుమతులను తగ్గించడం. అయితే అధిక ఖర్చుతో కూడిన రుణంగా మారింది అని అందువల్ల, ప్రభుత్వం కొనసాగించకూడదని నిర్ణయించింది అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తెలిపారు.