Homeరాజకీయాలుహరీశ్​ రావు పుట్టక ముందు నుంచే హైదరాబాద్ నగరం ఉంది

హరీశ్​ రావు పుట్టక ముందు నుంచే హైదరాబాద్ నగరం ఉంది

– ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి
– బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు

ఇదే నిజం, హైదరాబాద్: మంత్రి హరీశ్ రావు మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఈ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం హైదరాబాద్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఓడిపోతుందన్నప్పుడు బూతులు మాట్లాడడం వారికి అలవాటేనని, హరీశ్ రావు, ఆయన మామ కేసీఆర్ పుట్టక ముందు నుంచే హైదరాబాద్ నగరం ఉందని అన్నారు. నిజాం కంటే ముందు కూడా హైదరాబాద్ ఉందన్నారు. అనేక సాంస్కృతిక , సాంప్రదాయాలకు హైదరాబాద్ కేంద్రమని, దీనిపై చర్చకు బీఆర్ఎస్ నేతలు రావాలన్నారు. బీఆర్ఎస్ పుట్టుకకు హైదరాబాద్ నగరానికి ఎలాంటి సంబంధం లేదని, హైదరాబాద్ పేరును దొంగిలిస్తామంటే ఒప్పుకునేది లేదని మురళీధర్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలు కష్టపడితే నగరం ఈ స్థాయికి చేరుకుందని, టాలీవుడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ అని ఇందులో బీఆర్ఎస్ ప్రభుత్వం పాత్ర ఏంటని ఆయన ప్రశ్నించారు. దేశంలోనే జనరిక్ మెడిసిన్ ఉత్పత్తిలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని, వ్యాక్సిన్ తయారీలో కూడా ముందుందని.. వీటికి బీఆర్ఎస్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. కాకతీయ, కులీకుతుబ్ షా, నిజాం చరిత్ర చూస్తే తెలంగాణ నుంచి అమెరికాకు డాక్టర్‌లు, ప్రొఫెషనల్స్, ఇంజనీర్‌లు వెళ్లడంలో బీఆర్ఎస్ పాత్ర ఏంటన్నారు. హైదరాబాద్‌లో మాఫియా రాజ్యాం పోవాలంటే, వేగంగా అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పోవాలని ఆయన అన్నారు.

Recent

- Advertisment -spot_img