ప్రముఖ నటుడు, సినీ నిర్మాత, రాజకీయ నేత బండ్ల గణేష్.. అయనకు సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్లకు క్రేజ్ నెలకొంది. అయితే
తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. శుక్రవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు. దాంతో ఆయనకు ఎన్నో విషెస్ వచ్చాయి. రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు కూడా రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కానీ కొందరు సినీ జనాలు రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని బండ్లగణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండ్ల గణేష్ వారిని ఉద్దెశించి ఒక ట్వీట్‌ను షేర్ చేశారు. ” గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను”.. అంటూ ట్విట్ వేశారు. అయితే ఈ ట్విట్ తో బండ్ల గణేష్ పెను దుమారమే లేపాడు.