Homeహైదరాబాద్latest Newsజాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్

జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్

– అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన కలెక్టర్ అనురాగ్ జయంతి

ఇదేనిజం, సిరిసిల్ల జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన సిరిసిల్లలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూల మాలలు వేసి నివాళులర్పించారు. సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాధించిన ఘనతను నలుదిక్కులా చాటేలా, ప్రత్యేక రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసేలా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించుకుంటున్నందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రాముఖ్యతను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో వివరిస్తూ ఉద్యమకారులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అని అన్నారు. ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగా దశాబ్దాల కల నెరవేరిందని గుర్తు చేశారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ పది వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, జడ్పీ ఛైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, ఎస్పీ అఖిల్ మహాజన్, , జడ్పీ సీఈవో ఉమా రాణి, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేష్, రాజేశ్వర్, ఏఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img