Homeతెలంగాణ#Diwali2020 : బాణాసంచా నిషేధంపై క్రాకర్స్ అసోసియేషన్ ఆందోళన

#Diwali2020 : బాణాసంచా నిషేధంపై క్రాకర్స్ అసోసియేషన్ ఆందోళన

The High Court has issued orders banning the firing of fireworks for the Diwali festival. The Crackers Association is deeply concerned. Members of the Crackers Association gathered in Banjara Hills soon after the High Court orders were issued.

దీపావళి పండుగకు బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన వేళ.. క్రాకర్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. హైకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు బంజారా హిల్స్‌లో సమావేశమయ్యారు. ఈ రెండు రోజులు అనుమతి ఇవ్వకపోతే ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు వాపోయారు. సరకు అమ్ము డుపోయి.. అప్పులు తీరుతాయని అన్నారు. ప్రభుత్వం నిషేధిస్తే సరకును ఎక్కడ నిల్వ ఉంచాలని.. గోదాంలో ఉంచితే అక్రమమైందని పోలీసులు సీజ్ చేసే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ‘‘ప్రతి దీపావళికి 200 కోట్ల రూపాయల టపాసుల టర్నోవర్ జరుగుతుంది. 50 ఏళ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాం. హైకోర్టు తీర్పు మమ్మల్ని కలచి వేసింది. బ్యాన్ చేసేది ఉంటే ఫైర్ అనుమతులు ఎందుకు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. హైకోర్టు తీర్పు హోల్ సేల్ వ్యాపారులకు ఆరు నెలల కింద చెప్పి ఇచ్చి ఉంటే బాగుండేది.’’ అని అన్నారు.

‘‘రెండు రోజులు పాటు అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండు రోజులు అవకాశం ఇస్తే మా సరుకు అమ్ముడుపోయి.. అప్పులు తీరుతాయి. సరకును ఎక్కడ నిల్వ ఉంచాలనేది కూడా ప్రశ్నార్థకమే. గోదాములో ఉంచితే అక్రమమైందని సీజ్ చేసే ప్రమాదం ఉంది. ఈ రెండు రోజులు టపాసులు అమ్ముకొనేందుకు అనుమతి ఇవ్వకపోతే ఇక మాకు ఆత్మహత్యలే శరణ్యం’’ అని క్రాకర్స్ అసోసియేషన్ వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img