Homeహైదరాబాద్latest Newsబాలీవుడ్ భామలను తలపిస్తున్న స్టార్ క్రికెటర్ కూతురు

బాలీవుడ్ భామలను తలపిస్తున్న స్టార్ క్రికెటర్ కూతురు

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్. ఈ అమ్మడు త్వరలో బాలీవుడ్ ఆరంగ్రేటం చేయబోతున్నట్లు తెలుస్తోంది. సచిన్ తన ఆటతో అందరి మనసులు కొల్లగొడితే.. సారా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోదు. లండన్ కాలేజ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివిన సారా.. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబందించిన పోటోలను ఎప్పటికప్పుడూ షేర్‌ చేస్తూ.. అభిమానులకు టచ్‌లో ఉంటుంది.

ఈ క్రమంలో ఆమె ఏ ఫోటో షేర్ చేసినా అది నిమిషాల్లో వైరల్‌ అవుతుంటుంది. లేటెస్ట్ గా ఈ అమ్మడి ఫోటోలు తెగ వైరల్ గా మారాయ్. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఫ్యాషన్ లో ఎప్పుడూ తగ్గలేదు. తండ్రి క్రికెట్ రంగంలో కింగ్ అయినప్పటికీ తన ప్రత్యేకత కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది. మొన్నీ మధ్య పాపులర్ క్లాతింగ్ బ్రాండ్ కోసం మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యాక్టర్స్ అయిన బనితా సంధు, టానియా ష్రాప్ తో కలిసి ఓ ప్రమోషనల్ వీడియోలో కనిపించింది. సారా ఎంట్రీపై టెండూల్కర్ ఫ్యాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు. త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఖాయమని అనుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img