Homeహైదరాబాద్latest Newsసందే దేవసహాయం మృతి బాధాకరం

సందే దేవసహాయం మృతి బాధాకరం

– మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

ఇదే నిజం, దేవరకొండ: దేవరకొండ పట్టణానికి చెందిన సందే దేవసహాయం మృతి బాధాకరం అని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలో దేవసహాయం మృత దేహానికి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవసహాయం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన వెంట జడ్పీటీసీ సలహాదారుడు మారుపాకుల సురేష్ గౌడ్, పీఏసీయస్ చైర్మన్ ముక్కమల్ల బాలయ్య, అరేకంటి రాములు, రమావత్ తులిసిరం, వాడిత్య బాలు తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img