Homeహైదరాబాద్latest Newsవిజయ్ “గోట్” మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్…!

విజయ్ “గోట్” మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్…!

దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”. విజయ్ కెరీర్‌లో ఇది 68వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో సెకండ్ సాంగ్ పై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే దర్శకుడు వెంకట్ ప్రభు విజయ్ అభిమానికి రిప్లై ఇచ్చారు. అయితే సెకండ్ సాంగ్ పై ఎప్పుడూ అని అభిమానికి అడిగిన ప్రశ్నకి జూన్ లో అని అయన సమాధానం ఇచ్చాడు. జూన్ లో ఎలాగో విజయ్ బర్త్ డే ఉంది కాబట్టి అప్పుడే ఈ సాంగ్ వస్తుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఏ జి ఎస్ సినిమాస్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Recent

- Advertisment -spot_img