Homeరాజకీయాలుహనుమాన్ తీసింది నా కొడుకే.. డైరెక్టర్ తండ్రి ఎమోషనల్

హనుమాన్ తీసింది నా కొడుకే.. డైరెక్టర్ తండ్రి ఎమోషనల్

  • ప్రశాంత్ వర్మ తండ్రి ఎమోషనల్

ఇదేనిజం, హైదరాబాద్: హనుమాన్ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు ఉన్నప్పటికీ.. హనుమాన్ సక్సెస్ అయ్యింది. కాగా ఆదివారం హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ తండ్రి ఈ సినిమాను చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు.
‘హనుమాన్‌’ తీసింది మా అబ్బాయే. ఇంత మంచి సినిమా తీసినందుకు గర్వంగా ఉంది. ఇది అద్భుతం. థియేటర్లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. జీవితంలో మొదటిసారి గొప్ప అనుభూతిని పొందుతున్నాను. ఇందులోని నటీనటులంతా వారి పాత్రల్లో ఒదిగిపోయారు. హనుమాన్‌పై త్వరలోనే డైరెక్ట్‌ సినిమా తీస్తాడు’’ అంటూ దర్శకుడి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img