ఇదే నిజం, ధర్మపురి టౌన్: ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం డి సంయుద్దీన్ ధర్మపురిలోని ప్రధానాస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరును పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు .ఈ సందర్భంగా తను మాట్లాడుతూ ధర్మపురి, బుగ్గారం, వెలగటూరి మండలాల్లోని కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడువారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవలసిందిగా కోరారు, గత నెలలో 17 మందికి డయాలసిస్ సేవలు ధర్మపురి సెంటర్లో అందించినారు, గత సంవత్సరంలో 177 మందికి డయాలసిస్ సేవలు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నేరెళ్ల
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రాజేశం ఎనుగంటి, సతీష్ కుమార్ పాల్గొన్నారు.